About: http://data.cimple.eu/claim-review/088e09c87447b720be3190c0dd0e038a4b31d9e46602699eacb74a90     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Wed Feb 12 2025 19:17:39 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: ఓ కోతి ఆఫీసులో ఫైళ్లను తనిఖీ చేస్తున్న వీడియో అయోధ్య రామ మందిరానికి సంబంధించింది కాదు అయోధ్య రామ మందిరం రామ్లల్లా శంకుస్థాపన తర్వాత కూడా వార్తల్లో నిలిచింది. కొత్తగా ప్రారంభించిన రామాలయానికి దేశం నలుమూలల నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ TTD అవలంబించే క్రౌడ్ మేనేజ్మెంట్లో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. Claim :అయోధ్యలో రామ మందిరం పేరు రిజిస్ట్రేషన్ అయిందా లేదని చూస్తున్న కోతి Fact :ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లోని లాయర్ కార్యాలయంలోకి కోతి ప్రవేశించినట్లు వీడియో చూపిస్తుంది. అయోధ్య రామ మందిరం రామ్లల్లా శంకుస్థాపన తర్వాత కూడా వార్తల్లో నిలిచింది. కొత్తగా ప్రారంభించిన రామాలయానికి దేశం నలుమూలల నుండి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ TTD అవలంబించే క్రౌడ్ మేనేజ్మెంట్లో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇక ఆలయం, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం చుట్టూ చాలా తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల, ఒక కోతి కార్యాలయంలో కూర్చొని ఫైళ్లు, పత్రాలను పరిశీలిస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. అయోధ్యలోని రామాలయం రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అని ఆ కోతి పరిశీలిస్తుందనే వాదనతో వీడియోను షేర్ చేశారు. “అయోధ్యలో రామ మందిరం పేరు రిజిస్ట్రేషన్ అయిందా లేదని చూస్తున్న హనుమంతుడు జై శ్రీరామ్" అంటూ పోస్టులు పెట్టారు. “అయోధ్యలో రామ మందిరం పేరు రిజిస్ట్రేషన్ అయిందా లేదని చూస్తున్న హనుమంతుడు జై శ్రీరామ్" అంటూ పోస్టులు పెట్టారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో ఇటీవలిది కాదు.. అంతేకాకుండా అయోధ్యకు చెందినది కాదు. మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్లను ఉపయోగించి సెర్చ్ చేశాం. అక్టోబర్ 2023లో ప్రభుత్వ కార్యాలయంలో కోతి ఫైళ్లను తనిఖీ చేస్తుంది, అరటిపండ్లను పట్టించుకోలేదనే వాదనతో ప్రచురించిన YouTube వీడియో మాకు కనిపించింది. ‘Trending I Monkey check files at Government office, ignores Bananas” అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోను అక్టోబర్ 14, 2023న ఇండియా టుడే కూడా ప్రచురించింది, “ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లోని ఒక కార్యాలయంలో కోతి ఫైళ్లను చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఒక కోతి టేబుల్పై కూర్చొని, రిజిస్టర్ పేజీలను పరిశీలిస్తూ ఉంది. కోతికి అరటిపండ్లు ఇస్తున్నా కూడా.. అది వాటిని తీసుకోవడానికి నిరాకరించింది. బెహత్ తహసీల్ ప్రాంతంలోని ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన కార్యాలయంగా మొదట భావించారు.. అయితే, వైరల్ వీడియో ప్రభుత్వ కార్యాలయానికి చెందినది కాదని సహరాన్పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) దీపక్ కుమార్ స్పష్టం చేశారు. కోతి బెహత్ తహసిల్ ప్రాంతంలోని ఒక న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించి టేబుల్పై కూర్చుందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో కోతి బాగా తిరుగుతూ ఉంటుందని అన్నారు. ఈ ఘటనపై అటవీశాఖ, పోలీసు అధికారులకు సమాచారం అందించామని ఏడీఎం తెలిపారు. న్యూస్ 18 కూడా ఈ సంఘటనను నివేదించింది. అక్టోబర్ 2023లో UPలోని సహరన్పూర్లో జరిగిందని ధృవీకరించింది. వైరల్ వీడియో ఇటీవలిది కాదని.. అయోధ్యలోని రామమందిర రిజిస్ట్రేషన్ ఫైళ్లను కోతి చూడలేదని స్పష్టంగా చెబుతున్నాం. వీడియో పాతది, ఆ కోతి ఓ న్యాయవాది కార్యాలయంలోకి ప్రవేశించి ఫైళ్లను పరిశీలిస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. News Summary - Video showing monkey checking files in an office is not from Ayodhya Ram temple Claim : A monkey is checking the registration files in Ayodhya to know if the Ram Temple is registered or not Claimed By : Facebook Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Facebook Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software