schema:text
| - Thu Jul 18 2024 15:31:34 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ల కోసం 342 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు పెట్టడం లేదు.
ఫ్యాక్ట్ చెక్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ల కోసం 342 కోట్లు ప్రతీ ఏడాది ఖర్చు పెట్టడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాలో పాస్టర్ల కోసం ప్రతి ఏడాది ఏకంగా 342 కోట్లు ఖర్చు పెడుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
2020లో, కోవిడ్ -19 కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాస్టర్లకు గౌరవ వేతనంగా ఒకసారి రూ. 5,000 అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటిసారి ప్రకటించింది. ఇందులో భాగంగా 29,809 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.14.9 కోట్లు ఖర్చు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత, మైనారిటీస్ యాక్షన్ ప్లాన్ 2021-22లో భాగంగా పాస్టర్లకు ప్రతి నెల రూ. 5,000 అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కలెక్టర్ల పర్యవేక్షణలో సర్వే నిర్వహిస్తామని, అందుకు తగ్గట్టుగా పాస్టర్లకు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
https://christianminorities.
https://telugu.samayam.com/
పాస్టర్ల గౌరవ వేతనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఎన్రోల్మెంట్ నివేదికను మేము కనుగొన్నాము. కలెక్టర్ల నేతృత్వంలో జరిగిన ఈ సర్వేలో రాష్ట్రం నుంచి మొత్తం 8,463 చర్చిలు గౌరవ వేతనానికి అర్హత సాధించాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి కేవలం 518 చర్చిలు మాత్రమే గౌరవ వేతనానికి అర్హత సాధించినట్టు తెలిసింది. 518 చర్చిలకు నెలకు రూ.5వేలు చెల్లిస్తే ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.25.9 లక్షలు, ఏడాదికి రూ.3.10 కోట్లు ఖర్చు అవుతుంది.
http://36.255.253.252:8080/
ది హిందూలోని ఒక నివేదిక ప్రకారం, ఆగస్టు 2022లో రాష్ట్రంలోని 5,196 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి గౌరవ వేతనం రూ.5,000 ప్రకారం ఇవ్వడానికి రూ. 2.59 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది.
https://www.newindianexpress.
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
News Summary - Claim that AP spends Rs 342 cr per annum on salaries of pastors in East Godavari district alone is false
Claim : Andhra Pradesh government spends Rs 342 crore annually on the salaries of pastors in East Godavari district alone
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|