About: http://data.cimple.eu/claim-review/3b7217abc58038a34bcb3e6da8980d79fb49c5761a8640f26c864167     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • ఫ్యాక్ట్ చెక్: కుంభమేళాలో మూడు తలల ఏనుగు సంచరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు మహా కుంభమేళా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 Claim :మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ వీధుల్లో మూడు తలల ఏనుగు సంచరిస్తున్నట్లు వైరల్ వీడియో చూపిస్తోంది Fact :వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు, థాయ్లాండ్లోని అయుతయ ఖోన్ ఫెస్టివల్ (Aayuthaya Khon Festival) కు సంబంధించింది. మహా కుంభమేళా కోసం ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఈ మేళా జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో మూడు పవిత్ర నదులు ప్రవహించే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు. కుంభమేళా నాలుగు రకాలు. కుంభమేళా (4 సంవత్సరాలకు ఒకసారి), అర్ధ కుంభమేళా (6 సంవత్సరాలకు ఒకసారి), పూర్ణ కుంభమేళా (12 సంవత్సరాలకు ఒకసారి), మహా కుంభమేళా (144 సంవత్సరాలకు ఒకసారి). మహా కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద హిందువుల సమావేశం. మహా కుంభమేళా ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. మూడు నదులు కలిసే త్రివేణి సంగమం ఉన్న ప్రయాగ్రాజ్ ను అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. 2025 మహా కుంభమేళా చాలా అరుదైనది, 144 సంవత్సరాల తర్వాత జరుగనున్న ఈ మాహా మేళా అత్యంత అరుదైన సందర్భం. మహా కుంభమేళాకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయాగ్రాజ్లో భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక అధికారులు ఈ సమయంలో 1.5 నుండి 2 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా వేశారు. వసతి, పారిశుధ్యం, భద్రత, వైద్య సౌకర్యాల కోసం సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా, మహాకుంభ్ మేళా కు సంబంధించిన ఎన్నో విషయాలు చర్చ కు వస్తున్నాయి. ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్లో మూడు తలల ఏనుగు కనిపించిందని పేర్కొంటూ మూడు తలల ఏనుగు వీధిలో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “महाकुंभ प्रयागराज में दर्शन हवा तीन सिर वाले अद्भुत गजानंद का” అంటూ పలువురు యూట్యూబర్లు ఈ వీడియోను షేర్ చేశారు. క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు. ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్లను తీసుకుని గాగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అక్టోబర్ 2024లో ప్రచురించిన ఫేస్బుక్ పోస్ట్ని మేము కనుగొన్నాము. వైరల్ వీడియో అక్టోబర్ 2024 లోనే ఆన్లైన్లో షేర్ అయ్యిందనీ తెలుస్తోంది. అప్పటికి మహా కుంభమేళా సన్నాహాలు ఇంకా ప్రారంభమవ్వలేదు. @Love-6395 అనే యూట్యూబ్ ఛానల్ లో మే 2024 న ఈ వీడియోను పోస్టు చేశారు. ‘Prepare for the Ayutthaya Khon parade, a world-class event #Thai world heritage #Ayutthaya people #Khon Krung Sri 5th time #Art #Artwork”. The description of the video states ‘Prepare for the Ayutthaya Khon parade, a world-class event, a world heritage site for the Thai people of Ayutthaya. The 5th Krungsri Khon, three-headed elephant parade’. అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. అయుతయ ఖోన్ ఫెస్టివల్ లో రికార్డు చేసిన వీడియో అని అందులో తెలిపారు. Ayuttaya Khon Festival గురించి మరింత సమాచారం కోసం వెతకగా, మే 30 నుండి జూన్ 3, 2024 వరకు అయుతయ హిస్టారికల్ పార్క్లోని వాట్ మహత్లో ఈ ఫెస్టివల్ జరిగిందని తేలింది. మే 30 నుండి జూన్ 3 వరకు వాట్ మహాతత్, అయుతయ హిస్టారికల్ పార్క్, ఫ్రా నఖోన్ సి అయుతయ వద్ద, ఇతర ఉత్సవాలతో ఇలాంటి మూడు తలల ఏనుగును వీధుల్లో ఊరేగిస్తున్నట్లు చూపించే వీడియోను మేము కనుగొన్నాము. థాయిలాండ్లోని ప్రావిన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ జరిగిన ఈవెంట్లలో మూడు తలల ఏనుగును ఊరేగించారు. థాయ్ లాండ్లోని ఎరావాన్ మ్యూజియంలో 3 తలల ఏనుగు శిల్పం కూడా ఉన్నట్లు మేము కనుగొన్నాము. దీనిని ఎరావన్ అని కూడా పిలుస్తారు. ఇది హిందూ పురాణాలలో ఐరావత్కు మరొక పేరు. ఇది ఐరావతానికి థాయ్ పేరు. 3 తలలతో, ఇంద్రుడు దానిపై స్వారీ చేస్తున్న భారీ ఏనుగుగా పురాణాలు చెబుతున్నాయి. వీధిలో మూడు తలల ఏనుగుపై స్వారీ చేస్తున్న వ్యక్తిని చూపించే వైరల్ వీడియో భారతదేశానికి చెందినది కాదు. ఇది థాయ్లాండ్లో ప్రతి సంవత్సరం జరిగే అయుతయ ఖోన్ ఫెస్టివల్ లో చిత్రీకరించింది. మహా కుంభమేళా సమయంలో మూడు తలల ఏనుగు కనిపించిందన్న వాదన అవాస్తవం.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 5 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software