| schema:text
| - Wed Apr 15 2026 02:53:02 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు జారీ చేయలేదు. అదొక ఫేక్ లెటర్
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది
Claim :
హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందిFact :
తెలంగాణ హై కోర్టు నుండి అలాంటి ఆదేశాలు రాలేదు. అదొక ఫేక్ లెటర్సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా ఇటీవల భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చి వేసింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్ హౌస్తో పాటు, ఆరు అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన అత్యవసర ప్రకటన అంటూ హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని సోషల్ మీడియాలో నోటీసులు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తక్షణమే కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆ పోస్టుల్లో ఉన్నాయి. హైడ్రా కూల్చివేత కార్యకలాపాలకు సంబంధించిన ఇటీవలి చర్యలు, నిర్ణయాలు, ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసు జారీ చేసారంటూ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైడ్రా అధికారం కింద కూల్చివేసిన అన్ని ఆస్తుల గురించిన పూర్తి వివరాలను, ముఖ్యంగా సక్రమమైన విచారణ జరగలేదనీ, అక్రమంగా హక్కులను హరించారన్న ఆరోపణలపై దృష్టి సారిస్తూ, వెంటనే ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సమర్పించాలని కోర్టు ఆదేశిస్తోందని అందులో ఉంది.
ఆ పత్రంలో ఏప్రిల్ 12, 2026 తేదీన హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నుండి అర్జెంట్ జ్యుడీషియల్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కూల్చివేతల్లో నిబంధనలు పాటించలేదని, బాధితుల హక్కులను కాలరాశారనే ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆ నోటీసులో ఉంది.
వైరల్ లెటర్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇలాంటి నోటీసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వచ్చాయా అని తెలుసుకోడానికి మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ నిర్వహించాం. అయితే మాకు అలాంటి కథనాలు లభించలేదు. ఒకవేళ అటువంటి తీర్పు ఏదైనా వచ్చి ఉండి ఉంటే అది ఖచ్చితంగా మీడియాలో ప్రముఖంగా వచ్చి ఉండేది.
ఈ నోటీసుల్లో నిజా నిజాలు తెలుసుకోవడం కోసం మేము హైడ్రా అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా అందులో అందుకు సంబంధించిన వివరణ ఇచ్చారు.
"-- ఎంతకైనా తెగిస్తున్న కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు
-- ఏకంగా హైకోర్టు పేరిటే ఫేక్ నోటీసులపై హైడ్రా ఆగ్రహం
-- సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైడ్రా
కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఎంతటికైనా తెగిస్తున్నారు. ఏకంగా హై కోర్టు పేరిట ఫేక్ నోటీసులు సృష్టించేస్తున్నారు. ఈ ఫేక్ నోటీసుల పట్ల హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలు తొలగింపు విషయంలో తాజాగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్ విషయంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు.. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు హై కోర్టుకు హాజరవ్వాలంటూ హై కోర్టు పేరిట ఫేక్ సమన్లనుప్రచారం చేయడాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ఆ నోటీస్ ఫేక్ అంటూ హైడ్రా ప్రకటించింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. హైకోర్టు పేరుతో ఫేక్ నోటీస్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేసింది.హైడ్రా ఫిర్యాదుపై సైబర్ పోలీసులు విచారణ చేపట్టారు.
#HYDRAA #FakeNotice #FakeNewsAlert #CyberCrime " అంటూ వివరణ ఇచ్చారు.
ఇక ఇదే విషయాన్ని పలు తెలుగు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
https://www.v6velugu.com/
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : తెలంగాణ హై కోర్టు నుండి అలాంటి ఆదేశాలు రాలేదు. అదొక ఫేక్ లెటర్
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|