| schema:text
| - Fact Check: భగవంత్ మాన్ ఏడుస్తున్న పాత వీడియో ఒకటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో AAP అపజయానికి అనుసంధానించి వైరల్ చేయబడుతోంది
విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ వీడియో జులై 2024లో, ఆరోపించబడిన మద్యం స్కామ్ లో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కొరకు జంతర్ మంతర్ లో ఒక ర్యాలీ నిర్వహించబడినప్పటిది. ఈ సమయములో, భగవంత్ మాన్ భావోద్వేగానికి గురైయ్యారు. ప్రజలు ఇప్పుడు ఆ అసలైన వీడియోలోని ఒక క్లిప్పింగ్ ను తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు.
By: Jyoti Kumari
-
Published: Feb 13, 2025 at 04:25 PM
-
Updated: Feb 13, 2025 at 05:06 PM
-
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). భారతీయ జనతా పార్టీ (బిజేపి) 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. ఈ నేపథ్యములో, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ భావోద్వేగానికి గురైన ఒక వీడియో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. కొంతమంది యూజర్లు ఈ వీడియో క్లిప్పింగ్ ను ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ యొక్క పరాజయము తరువాత మాన్ కృంగిపోయాడని క్లెయిమ్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. వైరల్ వీడియో జులై 2024లో, ఆరోపించబడిన మద్యం స్కామ్ లో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కొరకు జంతర్ మంతర్ లో ఒక ర్యాలీ నిర్వహించబడినప్పటిది. ఈ సమయములో, భగవంత్ మాన్ భావోద్వేగానికి గురైయ్యారు. ప్రజలు ఇప్పుడు ఆ అసలైన వీడియోలోని ఒక క్లిప్పింగ్ ను తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేస్తున్నారు.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఫేస్బుక్ యూజర్ ‘క్వామి యోధ దీప్’ (ఆర్కైవ్డ్ లింక్) వైరల్ పోస్ట్ ను ఫిబ్రవరి 9, 2025 నాడు, “కేజ్రీవాల్ పరాజయము తరువాత ఏడుస్తున్న భగవంత్ మాన్” అనే శీర్షికతో షేర్ చేశారు.
దర్యాప్తు
వైరల్ వీడియో యొక్క ప్రామాణీకరణను ధృవీకరించుటకు, మేము సంబంధిత కీవర్డ్స్ ఉపయోగించి గూగుల్ సెర్చ్ నిర్వహించాము. మాకు దైనిక్ జాగరణ్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై జులై 31, 2024 నాడు అప్లోడ్ చేయబడిన సంబంధిత వీడియో ఒకటి లభించింది. ఆ వీడియోలో కూడా భగవంత్ మాన్ ఏడుస్తున్న అవే విజువల్స్ ఉన్నాయి. వీడియో వెంబడి అందించబడిన సమాచారము ప్రకారము, “అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించబడిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత ఆరు నెలలుగా తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. ఆయనకు మద్ధతుగా జంతర్ మంతర్ వద్ద ఒక ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్రప్రభుత్వము పై బలంగా దాడి చేశారు మరియు మాట్లాడేటప్పుడు సిఎం మాన్ భావోద్వేగానికి గురైయ్యారు”.
మాకు ఆమ్ ఆద్మి పార్టి యొక్క అధికారిక యూట్యూబ్ channel పై జులై 30, 2024 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియో లభించింది. వైరల్ వీడియో భాగము 15.48 నిమిషాల ఆ వీడియోలో 9.27 నిమిషాల మార్క్ వద్ద చూడవచ్చు.
ఈ వీడియో జగ్బాని యొక్క వెరిఫైడ్ X హ్యాండిల్ పై జులై 31, 2024 నాడు షేర్ చేయబడింది.
వైరల్ వీడియో కు సంబంధించిన మరిన్ని వార్తలను ఇక్కడ చూడవచ్చు.
మరింత స్పష్టత కొరకు మేము దైనిక్ జాగరణ్ లో ఆమ్ ఆద్మి పార్టి సంబంధించిన వార్తలను కవర్ చేసే విలేఖరి అయిన వి కే శుక్లను సంప్రదించాము. ఆయన ఈ వైరల్ క్లెయిమ్ తప్పని మరియు ఆ వీడియో పాతదని ధృవీకరించారు.
చివరిగా, పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము మరియు ఆ యూజర్ కు 8000 పైగా ఫాలోయర్స్ ఉన్నారు అని కనుగొన్నాము.
ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో సిఎం భగవంత్ మాన్ గురించిన వైరల్ వీడియో గురించిన క్లెయిమ్ తప్పని వెల్లడి అయింది. ఈ వీడియో 2024 నాటిది. ఇది అరవింద్ కేజ్రీవాల్ కు మద్ధతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ర్యాలీ జరిగినప్పుడు తీసినది. ఇందులో మాన్ భావోద్వేగానికి గురైయ్యారు. ఈ పాత వీడియో ఇప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికలకు తప్పుగా లింక్ చేస్తూ తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది.
Claim Review : కేజ్రీవాల్ పరాజయం తరువాత భగవంత్ మాన్ ఏడవడం ప్రారంభించారు.
-
Claimed By : ఫేస్బుక్ యూజర్ ‘క్వామి యోధ దీప్”
-
Fact Check : Misleading
-
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
|