About: http://data.cimple.eu/claim-review/499c64571d4ee55fda5297d71079bc8053e676961e7e21bb2fee2f29     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Feb 13 2026 03:52:29 GMT+0530 (India Standard Time) ఫ్యాక్ట్ చెక్: కొచ్చిలో సన్నీ లియోన్ కారు విజువల్స్ ను వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు సంబంధించిన విజువల్స్ గా ప్రచారం చేస్తున్నారు సన్నీ లియోన్ 2017లో కొచ్చికి వెళ్లినప్పటి విజువల్స్ Claim : గుంటూరులో వైఎస్ జగన్ కారును చుట్టుముట్టిన జనంFact : సన్నీ లియోన్ 2017లో కొచ్చికి వెళ్లినప్పటి విజువల్స్ ఇవివైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించారు. దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. గుంటూరు నగరం లోని సిద్దార్ధ నగర్ లో ఉన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లే ముందు వైఎస్ జగన్ రూట్ మ్యాప్ సిటీ లోని ముఖ్యమైన ప్రాంతాల గుండా వెళ్లేలా ప్లాన్ చేశారు. జగన్ తో పాటు పార్టీ కి చెందిన ముఖ్య నాయకులు కూడా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా నిబంధనలను, పోలీస్ ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా భారీ ర్యాలీలు నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసులు పెట్టారు. గుంటూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ని వైసీపీ నేతలు బహిరంగంగా ఉల్లంఘించినట్టు పోలీసులు నిర్దారించారు. అనుమతి లేకుండా భారీ కాన్వాయ్లతో ర్యాలీలు నిర్వహించడం పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయం వంటి చర్యలు పాల్పడినందుకు ఐదు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఓ కారును జనం చుట్టుముట్టినట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వైఎస్ జగన్ గుంటూరుకు వచ్చారని, జనం చుట్టుముట్టారంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న ఫోటోను నిశితంగా గమనించగా అందులో మెట్రో రైలు పనులు జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గుంటూరు నగరంలో ఇంకా మెట్రో పనులు మొదలవ్వలేదు. దీన్ని బట్టి ఇది గుంటూరు నగరానికి సంబంధించిన విజువల్స్ కావని తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు సంబంధించిన విజువల్స్ ను మనం చూడొచ్చు. వైరల్ ఫోటోలో ఉన్న కారు వైఎస్ జగన్ కాన్వాయ్ లో భాగం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక వైరల్ ఫోటోను మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ప్రముఖ నటి సన్నీ లియోన్ కొచ్చి పర్యటనకు సంబంధించిందిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను గమనించవచ్చు. 2017లో సన్నీ లియోన్ కొచ్చి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన అంటూ వైరల్ పోస్టుల ద్వారా తెలుస్తోంది. 2017 ఆగస్టు నెలలో కొచ్చిలో ఓ షాప్ ఓపెనింగ్ కు సన్నీ లియోన్ వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. పలు మీడియా సంస్థలు కూడా ఈ కథనాలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. నటి సన్నీ లియోన్ ఒక కార్యక్రమం కోసం కొచ్చి (కేరళ)కు వెళ్లారు. అక్కడ ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. సన్నీ లియోన్ ను ప్రేమిస్తున్నాము అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం వినవచ్చని ఈ కథనాల్లో పేర్కొన్నారు. కాబట్టి, సన్నీ లియోన్ కారు విజువల్స్ ను వైఎస్ జగన్ కారుకు సంబంధించిన విజువల్స్ గా ప్రచారం చేస్తున్నారు నటి సన్నీ లియోన్ ఒక కార్యక్రమం కోసం కొచ్చి (కేరళ)కు వెళ్లారు. అక్కడ ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. సన్నీ లియోన్ ను ప్రేమిస్తున్నాము అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేయడం వినవచ్చని ఈ కథనాల్లో పేర్కొన్నారు. కాబట్టి, సన్నీ లియోన్ కారు విజువల్స్ ను వైఎస్ జగన్ కారుకు సంబంధించిన విజువల్స్ గా ప్రచారం చేస్తున్నారు Claim : సన్నీ లియోన్ 2017లో కొచ్చికి వెళ్లినప్పటి విజువల్స్ ఇవి Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social Media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software