About: http://data.cimple.eu/claim-review/56e3f667bd1d4f92e581cb623e78761c9366955b4d72c6911bd990a9     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Wed Jun 24 2026 02:54:47 GMT+0530 (India Standard Time) ఫ్యాక్ట్ చెక్: 6550 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కడితే 10 లక్షల ముద్ర లోన్ అంటూ వైరల్ అవుతున్న లెటర్ లో ఎలాంటి నిజం లేదు 6550 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కడితే 10 లక్షల ముద్ర లోన్. Claim : 6550 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కడితే 10 లక్షల రూపాయల ముద్ర లోన్Fact : వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదుప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో పథకాలలో ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కూడా ఒకటి. వ్యాపారం చేయాలనుకునే వారి కోసం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు ఎలాంటి హామీ లేకుండా కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల వరకు లోన్ ఇస్తుంది. ఇదే ప్రధాన్ మంత్రి ముద్ర యోజన స్కీమ్. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం లోన్లు అందించడమే లక్ష్యంగా చిన్న చిన్న వ్యాపారుల కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ లాంఛ్ చేసింది. స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ స్కీమ్ ప్రారంభమైంది. ఈ పథకం కింద వ్యవసాయేతర, కార్పొరేట్ బెనిఫిట్స్ కోసం లోన్లు ఇస్తారు. ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే నిరుద్యోగులు, యువకులు, మహిళలు తమ వ్యాపారాల్ని మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా ఈ స్కీమ్ కిందలోన్లు పొందే వెసులుబాటు ఉంటుంది. శిశు లోన్ కింద రూ. 50 వేల వరకు రుణం పొందొచ్చు. కిషోర్ లోన్ కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం వస్తుంది. తరుణ్ లోన్ కింద రూ. 5-10 లక్షల వరకు లోన్ వచ్చేది. తరుణ్ ప్లస్ కేటగిరీలో రూ. 20 లక్షల వరకు లోన్ అందిస్తోంది. ముద్ర స్కీమ్ కింద లోన్లు పొందాలనుకుంటే కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. సాధారణ లోన్ల కంటే ఇందులో కాస్త తక్కువ వడ్డీ రేటుకే లోన్లు పొందొచ్చు. అయితే ఎలాంటి హామీ లేకుండా లోన్ పొందొచ్చు. లోన్ను ఈఎంఐల్లో చెల్లించాల్సి ఉంటుంది. రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. అయితే 6550 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కడితే 10 లక్షల రూపాయల ముద్ర లోన్ దక్కించుకోవచ్చంటూ ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ అవుతున్న లెటర్ ప్రజలను మోసం చేయడానికి సృష్టించింది. మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (PMMY) కు సంబంధించిన పలు విషయాలను అధికారిక వెబ్సైట్ లో చూసి కనుగొన్నాం. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు), మైక్రో ఫైనాన్స్ సంస్థలు (MFIలు), రిజిస్టర్డ్ సొసైటీలు, ట్రస్టులు, సెక్షన్ 8 కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా మాత్రమే ఈ రుణాలు ప్రజలకు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలు, తయారీ రంగం, వ్యాపారం, సేవా రంగం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న వారు ఈ సంస్థల ద్వారా ముద్రా లోన్లు పొందవచ్చని ఇందులో సవివరంగా తెలిపారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. ముద్రా అనేది ఒక రీఫైనాన్సింగ్ ఏజెన్సీ మాత్రమే. ఇది నేరుగా ఏ చిన్న వ్యాపారికీ, ఏ వ్యక్తికీ లోన్లు ఇవ్వదు. దానికి బదులుగా, ప్రజలకు లోన్లు ఇచ్చే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ముద్రా నిధులు సమకూరుస్తుంది. ఇక మా తదుపరి పరిశోధనలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం అబద్ధమని తేల్చి చెప్పింది. పీఎం ముద్రా యోజన పేరుతో కేటుగాళ్లు ప్రజల నుంచి డబ్బులు కాజేసేందుకు పన్నిన కుట్రగా దీన్ని అభివర్ణించింది. ఇలాంటి నకిలీ లేఖలు వాట్సాప్ లేదా మరే ఇతర మాధ్యమాల ద్వారా వచ్చినా అస్సలు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. పలు మీడియా సంస్థలు కూడా ఈ ఫేక్ లెటర్ ను ఖండిస్తూ నివేదికలను కూడా అందించాయి. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. ముద్ర లోన్స్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం https://mudra.org.in/FAQ లింక్ పై క్లిక్ చేయండి. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 6550 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కడితే 10 లక్షల రూపాయల ముద్ర లోన్ ఇస్తారంటూ మోసాలకు తెగబడుతూ ఉన్నారు. Claim : 6550 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కడితే 10 లక్షల రూపాయల ముద్ర లోన్. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు Claimed By : Social Media Users Claim Reviewed By : Telugupost Fact check Claim Source : Social media Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 21 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software