About: http://data.cimple.eu/claim-review/82040171f42f67337883452daa34430b2fb57a6679b98ea45482d125     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Thu Jul 18 2024 13:05:11 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: మహిళలు మద్యం సేవిస్తున్నట్లు చూపుతున్న వీడియో తెలంగాణలో చోటు చేసుకున్నది.. తమిళనాడుకు చెందినది కాదు తమిళనాడుకు చెందిన మహిళలు కలిసి మద్యం సేవిస్తున్నట్లు చూపుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది Claim :వైరల్ వీడియోలో మద్యం సేవిస్తున్న మహిళలు తమిళనాడుకు చెందినవారు Fact :ఈ వీడియో తెలంగాణకు చెందినది.. దసరా సందర్భంగా చిత్రీకరించారు తమిళనాడుకు చెందిన మహిళలు కలిసి మద్యం సేవిస్తున్నట్లు చూపుతున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. పిల్లలను పెంచాల్సిన మహిళలు ఇలాంటి సంస్కృతిలో భాగమయ్యారని వైరల్ పోస్ట్ చెబుతోంది. మహిళలు విందులో పాల్గొనడం.. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవడం.. కూల్ డ్రింక్స్తో కలిసి మద్యం సేవించడం వంటివి వీడియోలో చూపించారు. ఫ్యాక్ట్ చెకింగ్:వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియో తెలంగాణకు సంబంధించినది.. తమిళనాడుకు చెందినది కాదు. మేము వీడియో నుండి సంగ్రహించిన కీలక ఫ్రేమ్లను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా 'బంజారా అశ్విత' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము. రీల్స్ రూపంలో ఈ వీడియోను పోస్టు చేశారు. అక్టోబర్ 25, 2023న వీడియోను పోస్టు చేశారు. 'దసరా దావత్' అనే క్యాప్షన్ ఉంచారు. నిడివి ఎక్కువ ఉన్న వీడియోను నవంబర్ 4, 2023న అప్లోడ్ చేశారు. ఈ వీడియోలతో పాటు, మేము ఛానెల్లో ఇతర వీడియోలను కూడా పరిశీలించాము. ఈ మహిళలు స్థానిక గీతాలకు నృత్యం చేస్తున్నట్లు చూపించే మరొక వీడియో మాకు కనిపించింది. ఈ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలోని నాగర్కర్నూల్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన బంజారా అశ్విత అనే మహిళకు చెందినది. ఆమె బంజారా అనే తెగకు చెందినవారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని చూపిస్తూ ఈ ఛానెల్లో అనేక వీడియోలను అప్లోడ్ చేశారు. మద్యం సేవిస్తూ విందులో పాల్గొన్న మహిళల గుంపుకు సంబంధించిన వీడియో తెలంగాణ రాష్ట్రానికి చెందినది. తమిళనాడుకు సంబంధించినది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. News Summary - Video showing women consuming alcohol is from Telangana, not Tamil Nadu Claim : Women seen drinking alcohol in the viral video are from Tamil Nadu Claimed By : Social media users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social media Fact Check : Misleading Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software