About: http://data.cimple.eu/claim-review/88ef65fd81f21a8a30fb718dcaa1d1612899de32358b872f76596414     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri May 02 2025 14:16:12 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఉచితంగా రీఛార్జ్ అందిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పలేదు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇచ్చే వాళ్లకు 3 నెలల ఉచిత రీఛార్జ్ ఆఫర్ Claim : 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ దేశ ప్రజల కోసం ఉచిత మొబైల్ రీఛార్జ్ ఆఫర్ను ప్రకటించారు.Fact : వైరల్ లింక్ ఒక బూటకం. రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ఆఫర్ను ప్రకటించలేదు.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇచ్చే వాళ్లకు 3 నెలల ఉచిత రీఛార్జ్ ఆఫర్ ను అందజేస్తోందని పేర్కొంటూ వాట్సాప్ సందేశం వైరల్ అవుతోంది. URL లింక్ కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన ఉచిత రీఛార్జ్ ఆఫర్ను పొందేందుకు వెబ్సైట్పై క్లిక్ చేయమని వినియోగదారులను కోరింది. డిసెంబర్ 15వ తేదీలోపు ఈ ఆఫర్ ను వాడుకోవాలని ఆ మెసేజీలో కోరారు. “Rahul Gandhi is giving 3 months Free recharge to all Indian users so that more and more people can vote for Congress in 2024 elections and Congress government can be formed again. Click on the link given below to get 3 months free recharge ( Last date - 15 December 2023).” అంటూ మెసేజీని అప్లోడ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ లోని ఓటర్లకు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలని వైరల్ మెసేజీలో తెలిపారు. ఆ మెసేజీలో ఉన్న ఇమేజీలో 'కాంగ్రెస్ రీఛార్జ్ యోజన' అని కూడా ఉంది. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న పోస్టులో ఎలాంటి నిజం లేదు. కాంగ్రెస్ పార్టీ నుండి అటువంటి ప్రకటన ఏదీ రాలేదు.. కాబట్టి వైరల్ అవుతున్న ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆఫర్ ను ఇస్తున్నట్లు అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లేదా రాహుల్ గాంధీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత జాతీయ కాంగ్రెస్ (INC) కూడా పౌరులకు ఉచిత మొబైల్ రీఛార్జ్లను అందజేసే ప్రకటనలు చేయలేదు. రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ అటువంటి ప్రకటన ఏదైనా చేసి ఉంటే, అనేక వార్తా సంస్థలు అందుకు సంబంధించిన కథనాలను ప్రచురించేవి. కానీ అలాంటి కథనాలు ఏవీ కనిపించలేదు. ఇంకా, పోస్ట్లో ఉన్న వెబ్ లింక్ కు భారత జాతీయ కాంగ్రెస్తో ఎలాంటి సంబంధం లేదు. ఆ లింక్ ఒక బూటకం. మీ డేటాను దొంగిలించడం.. మీ ప్రైవసీకి భంగం కలిగించే పనులు చేయవచ్చు. ఇలాంటి మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని ఇప్పటికే చాలామంది నిపుణులు సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ పౌరులకు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ఆఫర్ను ప్రకటించలేదు. Claim : Rahul Gandhi announced free mobile recharge offer to citizens ahead of the 2024 General Elections. Claimed By : Whatsapp users Claim Reviewed By : Telugu Post Fact Check Claim Source : Whatsapp Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software