About: http://data.cimple.eu/claim-review/954c2134433b0e16d2e7879d8e03603910f60aec68e3e19b71f59a9a     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Jan 03 2025 16:03:56 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: 3000 సంవత్సరాల నాటి పద్మనాభ స్వామి విగ్రహం అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. వీడియో లోని పద్మనాభ స్వామి విగ్రహం Claim :వీడియో లోని పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటిది Fact :శివనారాయణ జ్యువెలర్స్ సంస్థ ఈ విగ్రహాన్ని రూపొందించింది కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి దేవాలయానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. 8వ శతాబ్దానికి చెందిన పద్మనాభస్వామి ఆలయానికి ఎంతో పవిత్రత ఉంది. ఈ ఆలయంలో విష్ణువు సర్పంపై పడుకుని ఉంటారు. మార్తాండ వర్మ రాజు కాలంలోనే ఈ ఆలయానికి సంబంధించిన పునర్నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ రోజు మనం చూస్తున్నది పురాతన ఆలయంపై నిశితమైన పునరుద్ధరణ పనుల ఫలితం. విష్ణువుకు పరమ భక్తుడైన రాజు మార్తాండ వర్మ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత పలువురు రాజులు, పాలకులు భారీగా విరాళాలు ఇచ్చారు. ఈ ఆలయానికి విరాళాలను కొనసాగించేందుకు, కాపాడుకోడానికి శ్రీ పద్మనాభ స్వామి ఆలయ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలోని నిధులకు సంబంధించి పలు కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే పద్మనాభస్వామి విగ్రహానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 7800 కిలోల స్వచ్ఛమైన బంగారంతో చేసిన విగ్రహం అంటూ చెబుతున్నారు. వాట్సాప్ లో అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. "7800 కిలోల స్వచ్ఛమైన బంగారం, 780,000 వజ్రాలు మరియు 780 క్యారెట్ల వజ్రాలతో 3000 సంవత్సరాల నాటి అనంత పద్మనాభస్వామి విగ్రహం 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు. దీని ప్రస్తుత విలువ కొన్ని వేల లక్షల కోట్లు అని, దీని ధరను అంచనా వేయలేమని సదాపతిలు, ఆధునిక నిపుణులు చెప్పారని అంటున్నారు. ఫ్రాన్స్ నుంచి ఆహ్వానం పలికిన నిపుణుల బృందం ఆశ్చర్యపోయి లెక్కలేనంత మొత్తంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీన్ని మన కళ్లతో చూడడం గొప్ప అదృష్టంగా భావించాలి. వ్యక్తిగతంగా వెళ్లలేని వారు ఈ వీడియో ద్వారా చూసి ప్రయోజనం పొందగలరు. ఎలా అంటే నందల్ స్వామిని, దేవుడిని చూడలేనప్పుడు ఆయన బొమ్మ లేదా విగ్రహం పెట్టి పూజిస్తాం." అంటూ వాట్సాప్ మెసేజీ వైరల్ అవుతూ ఉంది. వైరల్ వాట్సాప్ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు: "7800 కిలోల స్వచ్ఛమైన బంగారం, 780,000 వజ్రాలు మరియు 780 క్యారెట్ల వజ్రాలతో 3000 సంవత్సరాల నాటి అనంత పద్మనాభస్వామి విగ్రహం 3000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు. దీని ప్రస్తుత విలువ కొన్ని వేల లక్షల కోట్లు అని, దీని ధరను అంచనా వేయలేమని సదాపతిలు, ఆధునిక నిపుణులు చెప్పారని అంటున్నారు. ఫ్రాన్స్ నుంచి ఆహ్వానం పలికిన నిపుణుల బృందం ఆశ్చర్యపోయి లెక్కలేనంత మొత్తంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీన్ని మన కళ్లతో చూడడం గొప్ప అదృష్టంగా భావించాలి. వ్యక్తిగతంగా వెళ్లలేని వారు ఈ వీడియో ద్వారా చూసి ప్రయోజనం పొందగలరు. ఎలా అంటే నందల్ స్వామిని, దేవుడిని చూడలేనప్పుడు ఆయన బొమ్మ లేదా విగ్రహం పెట్టి పూజిస్తాం." అంటూ వాట్సాప్ మెసేజీ వైరల్ అవుతూ ఉంది. వైరల్ వాట్సాప్ మెసేజీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు: అదే వీడియో ట్విట్టర్ లో కూడా వైరల్ అయింది. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. సంబంధిత కీవర్డ్స్ తీసుకుని గూగుల్ సెర్చ్ చేశాం. ఇటీవలి కాలంలో అలాంటి విగ్రహానికి సంబంధించిన కథనాలేవీ మాకు లభించలేదు. వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని Googleలో రివర్స్ ఇమేజ్ శోధనను అమలు చేయడం ద్వారా మా పరిశోధనను ప్రారంభించాము. అందుకు సంబంధించి పలు రిజల్ట్స్ కనిపించాయి. శివనారాయణన్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో అదే విగ్రహానికి సంబంధించిన వీడియోను మేము చూశాం. ఆగస్టు 4, 2023న వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు. వీడియో వివరణలో కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అద్భుతమైన విగ్రహం నుండి ప్రేరణ పొంది ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. విష్ణువు యోగ నిద్ర స్థితిలో ఉండడం చూడొచ్చు. ఈ విగ్రహం 8 అంగుళాల ఎత్తు మరియు ఆశ్చర్యపరిచే 18 అంగుళాల పొడవు ఉంటుంది. 2 నెలల పాటు ప్రతిరోజూ 16 గంటలు 32 మంది పని చేశారు. ఈ విగ్రహం 2.8 కిలోల బరువు ఉంటుంది. దాదాపు 75,000 అధిక-నాణ్యత వజ్రాలతో అలంకరించారు, మొత్తం 500 క్యారెట్లు ఉంటుందని తెలిపారు. ఇందులో కొలంబియన్ పచ్చలు, సహజమైన బర్మీస్ కెంపులు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ విగ్రహానికి సంబంధించి పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. ఈ విగ్రహం 8 అంగుళాల ఎత్తు మరియు ఆశ్చర్యపరిచే 18 అంగుళాల పొడవు ఉంటుంది. 2 నెలల పాటు ప్రతిరోజూ 16 గంటలు 32 మంది పని చేశారు. ఈ విగ్రహం 2.8 కిలోల బరువు ఉంటుంది. దాదాపు 75,000 అధిక-నాణ్యత వజ్రాలతో అలంకరించారు, మొత్తం 500 క్యారెట్లు ఉంటుందని తెలిపారు. ఇందులో కొలంబియన్ పచ్చలు, సహజమైన బర్మీస్ కెంపులు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. ఈ విగ్రహానికి సంబంధించి పలు మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి. PTI న్యూస్ ఆగస్ట్ 22, 2023న ఈ విగ్రహానికి సంబంధించి వివరణను ఇచ్చింది. హైదరాబాద్ జ్యువెలరీ సంస్థ ఈ 2.8 కిలోల బంగారం, వజ్రాలు పొదిగిన విగ్రహంతో గిన్నిస్ బుక్లోకి 9వ సారి చోటు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుందని నివేదించింది. హైదరాబాద్కు చెందిన శివ నారాయణ్ జ్యువెలర్స్ సంస్థ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించిందని నివేదించారు. ఈ విగ్రహానికి సంబంధించి గతంలో పలు పోస్టులు వైరల్ అయ్యాయి. వాటిని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఖండించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. News Summary - Fact Check this is not 3000 year old statue of Padmanabha Swamy Claim : వీడియో లోని పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటిది Claimed By : Social Media Users Claim Reviewed By : Telugu Post Claim Source : Social Media Fact Check : False Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software