About: http://data.cimple.eu/claim-review/9f7d40b037b10eecce5ed22002a9d45851b841d080b668a187e56062     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • నిజ నిర్ధారణ: కర్నాటకలోని పురాతన ఆలయంలో శిల్పంగా పంచుకుంటున్న చిత్రం వాస్తవానికి మెక్సికన్ కళాకారుడి తయారు చేసిన కళాకృతి ఒక సైనికుడు కవచం, కిరీటం ధరించి కూర్చుని ఒక యంత్రం ముందు పని చేస్తున్న చిత్రం సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతోంది. మానిటర్ వంటిది చూస్తూ ఆ వ్యక్తి కీబోర్డ్పై టైప్ చేస్తున్న కంప్యూటర్ను పోలి ఉన్న యంత్రం పై పని చేస్తున్నట్టుగా ఉన్న ఈ చిత్రం తలగెరి ఒక సైనికుడు కవచం, కిరీటం ధరించి కూర్చుని ఒక యంత్రం ముందు పని చేస్తున్న చిత్రం సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫారమ్లలో వైరల్ అవుతోంది. మానిటర్ వంటిది చూస్తూ ఆ వ్యక్తి కీబోర్డ్పై టైప్ చేస్తున్న కంప్యూటర్ను పోలి ఉన్న యంత్రం పై పని చేస్తున్నట్టుగా ఉన్న ఈ చిత్రం తలగెరి, కర్ణాటక లో పల్లవ రాజులు నిర్మించిన శివ మందిరంలోని శిల్పం అంటూ ఈ చిత్రాన్ని పంచుకుంటున్నారు. ఆ చిత్రం ఈ కధనం తో పంచుకుంటున్నారు "1400 సంవత్సరముల క్రితం పల్లవ రాజు రెండవ నరశింహవర్మ కర్ణాటక లోని తలగిరి లో శివాలయము నిర్మించారు. ఈ ఆలయ శిల్పాలలో కంప్యూటర్ ను కీ-బోర్డుతో సహా ఉన్న శిల్పం ఎంతో ఆకర్షణ గా ఉంది. మన పూర్వీకులు భవిష్యత్ ప్రపంచ అభివృద్ధిని ముందే ఊహించి మహా గ్రంథాలు, ఇటువంటి శిల్పాల ద్వారా తెలియజేసారు. అది మన దేశ గొప్పతనం." Here are the archive links: https://web.archive.org/web/20220810070505/https://twitter.com/RajaPentapati11/status/1555850208268861440 https://web.archive.org/web/20220810071045/https://www.facebook.com/login/?next=https%3A%2F%2Fwww.facebook.com%2Fhindhugods%2Fphotos%2Fa.1620631191343766%2F7782733751800115%2F%3Ftype%3D3 నిజ నిర్ధారణ: వైరల్ చిత్రం కర్నాటకలోని తలగేరి ఆలయంలోని శిల్పం అనే వాదన అబద్దం. ఇది మెక్సికన్ కళాకారుడు రౌల్ క్రూజ్ ఇటీవల తయారు చేసిన కళాకృతి. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, ఈ చిత్రం 'కాస్మోస్ లాటినోస్ - యాన్ ఆంథాలజీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ ఫ్రమ్ లాటిన్ అమెరికా అండ్ స్పెయిన్' () అనే పుస్తకానికి కవర్ పేజీగా ఉపయోగించబడిందని తెలుస్తోంది - లాటిన్ అమెరికా నుండి సేకరించిన ఆంగ్ల సైన్స్ ఫిక్షన్. https://www.weslpress.org/9780819566348/cosmos-latinos/ ఈ పుస్తకం గురించి గూగుల్ బుక్స్ లో శోధించినప్పుడు, క్రెడిట్ లలో రౌల్ క్రూజ్ కళాకృతి మెమోరియా డెల్ ఫ్యూచర్గా కవర్ పేజీ ఇలస్ట్రేషన్ గా తెలుస్తోంది. ఈ క్రెడిట్లను కీలక పదాలుగా ఉపయోగించి శోధించినప్పుడు, ఆర్ట్ స్టేషన్.కాం లో రౌల్ క్రూజ్ ఆర్టిస్ట్ పేజీని లభించింది, అక్కడ వైరల్ చిత్రంతో పాటు అతని కళాకృతుల ప్రదర్శనను చూడొచ్చు. https://www.artstation.com/raulcruz అసలు రౌల్ క్రూజ్ ఆర్ట్వర్క్ అయిన వైరల్ ఇమేజ్ని ఈ వెబ్సైట్లో 'మెమరీ ఆఫ్ ది ఫ్యూచర్' పేరుతో చూడవచ్చు. ఇది ఈ ప్లాట్ఫారమ్లో 3 సంవత్సరాల క్రితం పోస్ట్ చేసారు. https://raulcruz.artstation.com/projects/2xyYyY ఆ ప్లాట్ఫారమ్పై కళాకారుడి పోర్ట్ఫోలియోను కూడా చూడవచ్చు. https://raulcruz.artstation.com/resume Strange Horizons అనే వెబ్సైట్ లో రౌల్ క్రజ్ గురించి వివరణ చూడోచ్చు. "రౌల్ క్రూజ్ (అ.క్.అ. ఋఅచ్రుఫి) మెక్సికో (ఫెర్నాండెజ్ పబ్లిషింగ్, రాబర్టో గౌడెల్లి, మాంటేజ్ మరియు మరిన్ని), యుఎస్ (మార్వెల్ కామిక్స్ మరియు హెవీ మెటల్ మరియు స్పెక్ట్రమ్ మ్యాగజైన్లు) వివిధ రకాల క్లయింట్ల కోసం 1983 నుండి ఫ్రీలాన్స్ ఇలస్ట్రేటర్గా పనిచేస్తున్నారు. రౌల్ పిల్లల పుస్తకాలు, మ్యాగజైన్ల కోసం కవర్లు, పోస్టర్లు, ట్రేడింగ్ కార్డ్లు, స్టోరీబోర్డుల కోసం ఇలస్ట్రేషన్లను సృష్టిస్తాడు, స్టేజ్ డిజైన్లో కూడా పని చేస్తాడు. మెక్సికోలో ఇలస్ట్రేషన్ స్కూల్స్ ఏవీ లేనందున, రౌల్ అడోబ్ ఫోటోషాప్, 3డి స్టూడియో, అక్రిలిక్స్ మరియు కోల్లెజ్ వంటి డిజిటల్ మరియు సాంప్రదాయ మాధ్యమాలను ఉపయోగించి తన స్వంత పద్ధతులను అభివృద్ధి చేశాడు. రౌల్ యొక్క కళాకృతి, అజ్టెక్, మాయన్ కళలచే ప్రేరణ పొందింది, సైన్స్ ఫిక్షన్ అద్భుతమైన థీమ్లతో సాంప్రదాయ అంశాలను మిళితం చేసింది. ప్రస్తుతం రౌల్ తన మొదటి ఆర్ట్ బుక్ కోసం పబ్లిషర్ని వెతుకుతున్నాడు. http://strangehorizons.com/art/future-ancestors/ అందువల్ల, ఇది భారతదేశంలోని పల్లవ రాజులు నిర్మించిన ఆలయంలోని శిల్పమని, పురాతన కాలం నాటిదనే వాదనతో పంచుకున్న చిత్రం వాస్తవానికి రౌల్ క్రూజ్ అనే మెక్సికన్ కళాకారుడి తయారు చేసిన కళాకృతి. ఇది పురాతన శిల్పం కాదు, ఇటీవలిది. దావా అబద్దం.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 11 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software