schema:text
| - Mon Dec 09 2024 14:25:14 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పొలాల్లో పులి తిరుగుతున్న వీడియోకు శ్రీకాకుళంకు ఎలాంటి సంబంధం లేదు
వైరల్ అవుతున్న వీడియోకు శ్రీకాకుళంకు
Claim :శ్రీకాకుళం లోని పొలాల్లో పులి కనిపించింది
Fact :వైరల్ అవుతున్న వీడియోకు శ్రీకాకుళంకు ఎలాంటి సంబంధం లేదు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అటవీ రేంజ్లో పులి కనిపించడంతో చుట్టుపక్కల గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నాయి. పులి ఓ దూడను చంపేసింది. దూడ కళేబరం, పాదముద్రలను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. జిల్లాలోని సంతకవిటి, కోటబొమ్మాళి మండలాల్లో పులి పులి గుర్తులను అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడు పేట పంచాయతీ పరిధిలోని పెద్ద కేసనాయుడు పేట గ్రామంలో కూడా పులి పాదముద్రలు లభ్యమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి పొడుగుపాడు ప్రాంతంలో పెద్దపులి హైవేను దాటుతున్న విజువల్స్ కూడా లభించాయి. కోటబొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. వరి కోత కోసం ప్రజలు ఎక్కువగా పొలాల్లో తిరుగుతూ ఉంటారు. పులి సంచారం కారణంగా గ్రామస్థులు గుంపులుగా మాత్రమే పొలాల్లోకి వెళ్లాలని, రాత్రిపూట ఒంటరిగా వరి పొలాలకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. పులులు సంచరించే ప్రాంతంలో పశువులు బహిరంగ ప్రదేశాల్లో ఉంచవద్దని అలాగే పులి తిరుగుతున్న ఆనవాళ్ళు గాని పాద ముద్రలు గానీ కనిపిస్తే తక్షణమే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. పులికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఈ 630226757, 9440810037 నెంబర్లకు సంప్రదించాలని అధికారులు కోరారు.
పంటపొలాల్లో ఓ పులి తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోకు శ్రీకాకుళంకు ఎలాంటి సంబంధం లేదు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా "Bettiah – चनपटिया मिश्रौली पुरैना में बाघ का आतंक | गांव में घुस गया बाघ" అనే టైటిల్ తో News Roots 24 "Bihar" అనే ఛానల్ లో 25 జులై 2024న ఇదే వీడియోను పోస్టు చేశారు.
పలువురు ఇదే వీడియోను షార్ట్స్ లో షేర్ చేశారు.
దీన్ని బట్టి, ఈ వీడియో ఇటీవలిది కాదని స్పష్టంగా తెలుస్తోంది.
రిపబ్లిక్ టీవీ ఎక్స్ అకౌంట్ లో కూడా ఇదే వీడియోను పోస్టు చేశారు. జులై 4, 2024న అస్సాం రాష్ట్రంలోని ఓ గ్రామంలో పులి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ అందులో తెలిపారు.
దీన్ని క్యూగా తీసుకుని మేము కీవర్డ్ సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలకు సంబంధించిన వెబ్ సైట్లలో అస్సాంలో పులి కనిపించిందంటూ ఇదే వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను పోస్టు చేశారని గుర్తించాం. ఆ కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
జులై 4న ప్రచురించిన కథనంలో అస్సాంలో ఓ వైపు వరదలు రాగా, నాగాన్లోని జెంగాని గ్రామంలో రాయల్ బెంగాల్ టైగర్ భయాందోళనలకు గురి చేసి తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలిపారు. వైరల్ వీడియోలో పులి వరి పొలంలో తిరుగుతూ ఉండగా గ్రామస్థుల అరుపులకు చుట్టూ పరిగెత్తింది. పులి ఇద్దరు స్థానికులపై దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. అబ్దుల్ అజీజ్, అక్తర్ అలీ హుస్సేన్ అనే వ్యక్తులు ఈ దాడిలో తీవ్ర గాయాలపాలయ్యారని, వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.
news9live వెబ్సైట్ కూడా అస్సాంలోని గ్రామంలో జరిగిన ఘటన అంటూ నివేదించింది. కొంత కాలంగా ఈ ప్రాంతంలో పులి సంచరించడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయని స్థానికులు తెలిపారు. ఘటనానంతరం స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులు నిఘా పెట్టారని కథనంలో ఉంది.
ఈ వీడియో అస్సాంలో జులై నెలలో రికార్డు చేసినట్లుగా పలువురు యూట్యూబ్ లో వీడియోలు పెట్టారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియో అస్సాంకు చెందినదని, శ్రీకాకుళంకు చెందినది కాదని ధృవీకరించాం.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now
News Summary - Fact Check The video of the tiger roaming in the fields has nothing to do with Srikakulam
Claim : శ్రీకాకుళం లోని పొలాల్లో పులి కనిపించింది
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugu Post
Claim Source : Social Media
Fact Check : False
Next Story
|