About: http://data.cimple.eu/claim-review/c9b450302dcef77e4036bf2401d6d75e830d45a42207b1114ae5b200     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • నిజ నిర్దారణ: రోహింగ్యా శరణార్ధ శిబిరంలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన పాత ఫోటోని తప్పుడు వాదనతో పంపించారు విశ్వాస్ టీమ్ దర్యాప్తులో, రోహింగ్యా శరణార్థి పేరిట వచ్చిన వాదన నకిలీదని తేలింది. - By: Pallavi Mishra - Published: Aug 31, 2022 at 12:32 PM - Updated: Aug 31, 2022 at 03:00 PM న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్). ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిలో ఒక వ్యక్తి విరిగిన మంచం మీద కూర్చుని కనిపిస్తున్నాడు. వైరల్ ఫోటోలో ఆ వ్యక్తి చుట్టూ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ వ్యక్తి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. వ్యక్తి రోహింగ్యా శరణార్థి అని, అతనికి బట్టలు లేదా తినడానికి ఏమీ లేవని, అతనికి ముగ్గురు (3)భార్యలు, 8 మంది పిల్లలు మరియు ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నాయని ఆ పోస్ట్ తెలిపింది. విశ్వాస్ టీమ్ దర్యాప్తులో ఈ పోస్ట్ నకిలీదని తెలిసింది. ఈ ఫోటో తీసిన జర్నలిస్ట్ వైరల్ అయిన ఆ వాదన నిజం కాదని, ఆ చిత్రంలోని పిల్లలు ఆ వ్యక్తికి చెందిన వారు కాదని, అతని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కూడా అతనిది కాదని చెప్పారు. వైరల్ పోస్ట్ లో ఏముంది ఫేస్ బుక్ యూజర్ అప్నా తరుణ్ చుగ్ ఒక ఫోటోని ఇలా ఒక క్యాప్షన్ తో అప్ లోడ్ చేశారు. “ఇది రోహింగ్యా కుటుంబం. ఢిల్లీలోని రోడ్డుమీద వీరు నిరాశ్రయులయ్యారు. 8 మంది పిల్లలతో పాటు, ముగ్గురు (3) భార్యలు, వీరిలో ఇద్దరు గర్భవతులు కూడా. అతని చేతిలో శామ్సంగ్ C7 ప్రో మొబైల్ ఉంది, దాని ధర రూ. 29,000 ఉండవచ్చు. ప్రతిపక్షాలు వారి పరిస్థితిని చూసి విచారపడుతూ, సకాలంలో పన్నులు చెల్లిస్తూ ఉండండి” అన్నారు. వైరల్ పోస్ట్ కి సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు. విచారణ మా దర్యాప్తును ప్రారంభించడానికి, ముందుగా మేము వైరల్ ఇమేజ్ ని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. 15, ఏప్రిల్ 2018 నాడు ఫైల్ చేసిన news18.com రిపోర్ట్ లో ఈ ఇమేజ్ ని మొదటిసారిగా అప్ లోడ్ చేసినట్లుగా మాకు తెలిసింది. ఈ ఫోటోతో పాటు వివరించిన సమాచారం ప్రకారం ఈ ఫోటోను దేబయాన్ రాయ్ అనే అతను క్లిక్ మనిపించాడు. ఢిల్లీలోని ఒక మురికివాడలో జరిగిన అగ్నిప్రమాదం గురించి ఈ వార్త వచ్చింది. ఏప్రిల్ 15, 2018న ఢిల్లీలోని మదన్పూర్ ఖాదర్ లోని రోహింగ్యా శరణార్ధ శిబిరంలో అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదం కారణంగా చాలా మంది కాలి చనిపోయారు. వైరల్ అయిన పోస్ట్ లోని వాదనకు సంబంధించిన ఏ విషయమూ కూడా వార్తలలో ఎక్కడా కనబడలేదు. ఆ ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్ దేబయాన్ రాయ్ తో ట్విట్టర్లో సంప్రదించాము. దానికి ప్రతిస్పందిస్తూ, దేబయాన్ రాయ్ ఈ పోస్ట్ ఫేక్ అన్నారు. ఈ సమాచారం పూర్తిగా తప్పు అని ఆయన అన్నారు. 2018 లో ఢిల్లీలోని మదన్ పూర్ ఖాదర్ లోని మురికివాడ జనావాసంలో మంటలను ఆర్పడానికి తాను వెళ్లినప్పుడు ఈ ఫోటోని తాను తీసినట్లుగా ఆయన చెప్పారు. ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి రోహింగ్యా అని ఆయన చెప్పారు. అతనికి ముగ్గురు భార్యలు ఇంక 8 మంది సంతానం అనే వాదన అబద్ధం. అతని చేతిలో ఉన్న ఫోన్ కూడా అతనిది కాదు, అతనికి సహాయం చేయడానికి వాలంటీర్ గా వచ్చిన ఒకతనిది. ఈ విషయమై దేబయాన్ రాయ్ చేసిన ఒక పాత ట్వీట్ ను కూడా మేము చూశాము, అందులో అతను ఆ వాదనను నకిలీదిగా పేర్కొన్నారు. కీలక పదాలతో వెతికి, ఏప్రిల్ 2018 లో రోహింగ్యా శిబిరంలో జరిగిన ఆకస్మిక అగ్నిప్రమాదం కారణంగా 200 కి పైగా గుడిసెలు కాలిపోయాయని మేము తెలుసుకున్నాము. ఆ సమయంలో అనేక మీడియా సంస్థలు దానిని కవర్ చేశాయి. విశ్వాస్ న్యూస్ ఇంతకు ముందు ఒకసారి ఇదే ఫోటోకి సంబంధించిన వాదనను నిజనిర్ధారణ చేసింది. అది ఇక్కడ చదవవచ్చు. చివరగా, మేము నకిలీ పోస్ట్ వైరల్ చేసిన ఫేస్ బుక్ యూజర్ అప్నా తరుణ్ చుగ్ ప్రొఫైల్ ని సోషల్ స్కాన్ చేశాము. ఈ పేజీకి 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. निष्कर्ष: విశ్వాస్ టీమ్ దర్యాప్తులో, రోహింగ్యా శరణార్థి పేరిట వచ్చిన వాదన నకిలీదని తేలింది. - Claim Review : ఇది రోహింగ్యా కుటుంబం. ఢిల్లీలోని రోడ్డు మీద నిరాశ్రయులయ్యారు. 8 మంది పిల్లలతో పాటు, ముగ్గురు (3) భార్యలు, వీరిలో ఇద్దరు గర్భవతులు కూడా. అతని చేతిలో శాంసంగ్ C7 ప్రో మొబైల్ చేతిలో ఉంది, దాని ధర రూ .29,000 ఉండవచ్చు. వారి పరిస్థితిని చూసి ప్రతిపక్షాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి - Claimed By : ఫేస్ బుక్ పేజీ అప్నా తరుణ్ చుగ్ - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software