About: http://data.cimple.eu/claim-review/e2d4361cf0530001abc256354b844cccbfb5da7d1356d69fcb947c19     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Wed Nov 20 2024 14:33:23 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: రష్మిక మందాన లిఫ్ట్ లో ఎక్కుతున్నట్లుగా ఉన్న వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినది డీప్ఫేక్ అనేది ఒక కృత్రిమ మేధస్సు.. ఈ టెక్నాలజీని ఉపయోగించి కావాల్సిన వ్యక్తులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సృష్టించవచ్చు. Claim :వైరల్ వీడియోలో ఉన్నది రష్మిక మందాన Fact :ఆ వీడియోలో ఉన్నది నటి రష్మిక మందాన కాదు, బ్రిటీష్-ఇండియన్ యువతి జారా పటేల్ డీప్ఫేక్ అనేది ఒక కృత్రిమ మేధస్సు.. ఈ టెక్నాలజీని ఉపయోగించి కావాల్సిన వ్యక్తులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సృష్టించవచ్చు. డీప్ఫేక్ ద్వారా చాలా మంది వ్యక్తులకు సంబంధించి విజువల్ కంటెంట్ను మార్చవచ్చు. దీనికి మెషిన్ లెర్నింగ్, AIని ఉపయోగిస్తారు. అనేక AI- రూపొందించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉన్నాయి, అయితే ఇప్పుడు డీప్ఫేక్లు మరింత సులువుగా క్రియేట్ చేయడానికి వీలవుతూ ఉంది. అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్ వేర్ ల ఫలితంగా మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా డీప్ఫేక్లు రూపొందించవచ్చు. ప్రముఖ నటి రష్మిక మందానకు సంబంధించిన వీడియో అంటూ ఓ యువతి లిఫ్ట్ లోకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ యువతి లిఫ్ట్ లోకి ఆఖరి నిమిషంలో ఎక్కడమే కాకుండా.. లిఫ్ట్ లోని వ్యక్తికి హాయ్ చెప్పడం కూడా మనం గమనించవచ్చు. పలు సోషల్ మీడియా అకౌంట్స్ లలో ఈ వీడియోను షేర్ చేశారు. “Yeh Rashmika Hai?? CrushmikaaaaaDescription: Description: ” అంటూ పోస్టులు పెట్టారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. ఈ వీడియోను ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా సృష్టించారు. జాగ్రత్తగా గమనించినప్పుడు, వీడియో ప్రారంభంలో ఆ యువతి ముఖం లిఫ్ట్లోకి ప్రవేశించాక రష్మిక లాగా మారుతూ ఉండడం గమనించవచ్చు. మేము రష్మిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను సెర్చ్ చేసినప్పుడు, అందులో వైరల్ వీడియో మాకు కనిపించలేదు. మరింత సెర్చ్ చేయగా.. మేము X (Twitter)లో అభిషేక్ కుమార్ అనే జర్నలిస్ట్ చేసిన పోస్ట్ని కనుగొన్నాము, ఇంటర్నెట్లో నకిలీ కంటెంట్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి కొత్త చట్టాలు, నియంత్రణ చర్యల అవసరం ఉందని అన్నారు. వైరల్ వీడియోను “There is an urgent need for a legal and regulatory framework to deal with deepfake in India. You might have seen this viral video of actress Rashmika Mandanna on Instagram. But wait, this is a deepfake video of Zara Patel. This thread contains the actual video.” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. భారతదేశంలో డీప్ఫేక్ను ఎదుర్కోవడానికి కఠిన చట్టాలు, నియంత్రణ తక్షణమే అవసరం ఉందని అన్నారు. ఇన్స్టాగ్రామ్లో నటి రష్మిక మందాన వైరల్ వీడియోను మీరు చూసి ఉండవచ్చు. అయితే ఇది జరా పటేల్ అనే యువతికి సంబంధించిన వీడియో..! దాన్ని డీప్ఫేక్ వీడియోగా మార్చారు. ఈ థ్రెడ్లో అసలు వీడియో ఉందని తెలిపారు. ఆయన ఒరిజినల్ వీడియోను “The original video is of Zara Patel, a British-Indian girl with 415K followers on Instagram. She uploaded this video on Instagram on 9 October.” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. అసలు వీడియోలో ఉన్నది.. బ్రిటిష్-ఇండియన్ అమ్మాయి జరా పటేల్ అని తెలిపారు. ఆమె ఈ వీడియోను అక్టోబర్ 9న ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది. అమితాబ్ బచ్చన్ కూడా అభిషేక్ పోస్ట్ను షేర్ చేశారు. ఇలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరా పటేల్ గురించి సెర్చ్ చేయగా.. మేము ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా జారాపటేల్ని కనుగొన్నాము. ఆమె బయో ప్రకారం, ఆమె పూర్తి సమయం డేటా ఇంజనీర్ గా పని చేస్తున్నారు. బ్రిటిష్-ఇండియన్ అమ్మాయి అని చెప్పుకొచ్చారు. “You almost closed the elevator door on me again” అంటూ ఒరిజినల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జరా పటేల్. “You almost closed the elevator door on me again” అంటూ ఒరిజినల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది జరా పటేల్. రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నెట్టింట తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలదేనని స్పష్టం చేశారు. నెట్టింట భారతీయుల భద్రత, నమ్మకం పెంపొందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంత్రి చంద్రశేఖర్ ఐటీ చట్టంలోని పలు నిబంధనలను నెటిజన్లతో పంచుకున్నారు. యూజర్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయకుండా చూడాల్సిన చట్టపరమైన బాధ్యత ఆయా వేదికలపై ఉందన్నారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలన్నారు. నిబంధనలు పాటించని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై రూల్ 7 వర్తిస్తుందని, సంస్థలపై కోర్టును ఆశ్రయించే హక్కు బాధితులకు ఉందని తెలిపారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో చాలా ప్రమాదకరమైనదని, తప్పుడు సమాచార వ్యాప్తికి ఆస్కారం ఉందని, ఈ విషయంలో సోషల్ మీడియా వేదికలు గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై రష్మిక స్పందించింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తోందని.. నాకే కాదు, మనలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దారుణమైన పరిస్థితి పొంచి ఉందని తెలిపింది రష్మిక. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తుండడమే అందుకు కారణం. ఇవాళ నేను ఒక మహిళగా, నటిగా నా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారే నా రక్షణ వ్యవస్థలు, వారే నాకు వెన్నంటి ఉన్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితే నేను స్కూల్లోనో, కాలేజ్ లోనో చదువుకుంటున్నప్పుడు ఎదురైతే నేను ఏం చేయగలనన్నది ఊహకందని విషయం. అందుకే, ఇలాంటి విషయాలను వెంటనే సామాజికపరంగా చర్చకు పెట్టాలి. మరెంతో మంది ఈ డీప్ ఫేక్ వీడియోల బారినపడకుండా రక్షించాలని రష్మిక స్పందించింది. నటి రష్మిక ఎలివేటర్లోకి వెళుతున్నట్లు చూపించే వీడియో అసలైనది కాదు. ఇన్స్టాగ్రామ్ యూజర్ జరా పటేల్ వీడియోకు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రష్మిక ముఖాన్ని తగిలించారు. ఈ వాదన తప్పుదారి పట్టించేది. News Summary - Viral video showing actress Rashmika Mandanna entering lift is a Deepfake Claim : Viral video shows Indian actress Rashmika Mandanna Claimed By : Instagram Users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Social media Fact Check : Misleading Next Story
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 1 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software