About: http://data.cimple.eu/claim-review/7847f5fac9696afe452281fc8b4eaa11af13c19adaa1611a005e8346     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fri Aug 16 2024 15:24:07 GMT+0000 (Coordinated Universal Time) ఫ్యాక్ట్ చెక్: వీధిలో కట్టివేసిన అమ్మాయిని చూపించే వీడియో బంగ్లాదేశ్ లో వీధి నాటకంలో భాగం వివాదాస్పద ప్రభుత్వ ఉద్యోగ కోటా రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా అశాంతి చెలరేగింది. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాను రద్దు చేయాలనే యూనివర్శిటీ విద్యార్థుల శాంతియుత డిమాండ్ల కారణంగా జూలై ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి Claim :బంగ్లాదేశ్ లోని వీధుల్లో హిందూ బాలికను కట్టివేసినట్లు ఒక వీడియో చూపిస్తుంది Fact :వీధి నాటకంలో భాగంగా ఒక కళాశాల విద్యార్థి నిరసన తెలుపుతున్నట్లు వీడియోలో ఉంది వివాదాస్పద ప్రభుత్వ ఉద్యోగ కోటా రిజర్వేషన్లపై బంగ్లాదేశ్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా అశాంతి చెలరేగింది. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో కోటాను రద్దు చేయాలనే యూనివర్శిటీ విద్యార్థుల శాంతియుత డిమాండ్ల కారణంగా జూలై ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థనలు చాలా వరకు నెరవేరినప్పటికీ, PM షేక్ హసీనా 'రజాకార్' వ్యాఖ్యల తర్వాత.. నిరసనలు కాస్తా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందాయి. ఘర్షణలు విస్తరించడంతో.. జరిగిన హింసలో 300 మందికి పైగా మరణించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను నిలిపివేశారు. షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఆందోళనకారులు మాజీ ప్రధాని షేక్ ముజీబుర్ రెహమాన్ పెద్ద విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ప్రధాని అధికారిక నివాసంలోకి చొరబడి గందరగోళం సృష్టించారు. పదవికి రాజీనామా చేసిన తర్వాత షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆమె రాజీనామా తర్వాత మిలటరీ అధికారులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. బంగ్లాదేశ్ లోని హిందూ మైనారిటీలకు వ్యతిరేకంగా హింస జరిగిందని.. ఆ ప్రాంతంలో జరిగిన అల్లర్ల గురించి పలువురు సోషల్ మీడియా వినియోగదారులు వివిధ పోస్ట్లను షేర్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో విద్యార్థులు చేసిన హింసాకాండతో బంగ్లాదేశ్లో హిందూ మహిళల దుస్థితిని ఆ వీడియో చూపుతుందన్న వాదనతో వీడియో షేర్ చేశారు. ఓ బాలిక చేతులు, కాళ్లు కట్టేసి, అరవకుండా ఉండేందుకు నోటికి ప్లాస్టర్ వేసి వీధిలో ఆ అమ్మాయిని ఉంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “World...Are you watching the Heart - Heart-wrenching situation of Hindu Women in Bangladesh? These radical Islamists are targeting Hindu women. Mr Prime Minister, Please act @narendramodi” అంటూ పోస్టులు పెట్టారు. బంగ్లాదేశ్ లో హిందూ మహిళలకు కనీస రక్షణ లేదని.. దయచేసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. ” बांग्लादेश का यह विडियो देखने के बाद भी अगर तुम यह सोचते हो कि "मोदी" #Dictator है! उसे सत्ता से उखाड़ फेंकना है तो कल आपके सामने आपकी बहन बेटी के साथ भी ऐसा ही बर्ताव होने वाला है! और अपनी अम्मी से अपना ब्लड ग्रुप पता कर लेना!!” అంటూ హిందీలో కూడా పోస్టులు పెట్టారు. ఈ వీడియో చూశాక కూడా మోదీని డిక్టేటర్ అని అనుకుంటూ ఉన్నారు. ఆయన పదవిలో లేకపోతే మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఇలాగే తయారై ఉండేదని అందులో ఆరోపించారు. ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో బంగ్లాదేశ్ నిరసనకారుల దౌర్జన్యాలకు సంబంధించిన వీడియో కాదు. నిరసన ప్రదర్శనలో భాగంగా జగన్నాథ్ యూనివర్శిటీ విద్యార్థులు ప్రదర్శించిన వీధి నాటకాన్ని ఇందులో చూపించారు. మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్లను తీసుకుని సెర్చ్ చేశాం. ఆ వీడియోను JnU షార్ట్ స్టోరీస్ అనే పేరు గల Facebook పేజీ జూలై 26, 2024న మొదటిసారిగా అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. వీడియోతో పాటు పోస్ట్ లో చేసిన ప్రకారం.. “మీ పుకార్ల కారణంగా అమ్మాయి ఈ రోజు బాధపడుతూ ఉంది. వైరల్ వీడియోలోని అమ్మాయి 2021-22 విద్యా సంవత్సరంలో జగన్నాథ్ విశ్వవిద్యాలయంలో సాధారణ విద్యార్థి. అవంతిక అనే అమ్మాయి ఆత్మహత్యకు నిరసనగా జరిగిన నాటకంలో దృశ్యమే ఈ వీడియో! కానీ కొందరు వ్యక్తులు ఫేస్బుక్లో వీడియోను పంచుకున్నారు. ఆ అమ్మాయిని ఇప్పుడు ఛత్ర లీగ్కు నాయకురాలిగా వైరల్ చేశారు.. ఇది చూసిన ఆ అమ్మాయి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రతి ఒక్కరూ అమ్మాయికి అండగా నిలవండి, మీరు ఈ వీడియోను ఎక్కడ చూసినా, కామెంట్లలో అసలు నిజాన్ని తెలియజేయండి. ఈ పుకార్లను అరికట్టడానికి దయచేసి ఈ పోస్ట్ని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి” అని ఉంది. ఆ అమ్మాయి ఛత్ర లీగ్ లీడర్ అని పేర్కొంటూ వీడియో తప్పుగా షేర్ చేశారని తెలుస్తోంది. కాబట్టి.. అబంతిక అనే మరో విద్యార్థి ఆత్మహత్య తర్వాత నిరసనలో భాగంగా జగన్నాథ్ యూనివర్శిటీకి చెందిన ఒక బాలిక వీధి నాటకాన్ని చేసిన పాత వీడియో వైరల్ అవుతోంది. బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై జరిగిన దాడి అంటూ వైటల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. News Summary - Video of a girl tied up in the street is part of a street play in Bangladesh Claim : బంగ్లాదేశ్ లోని వీధుల్లో హిందూ బాలికను కట్టివేసినట్లు ఒక వీడియో చూపిస్తుంది Claimed By : Twitter users Claim Reviewed By : Telugupost Fact Check Claim Source : Twitter Fact Check : False Next Story
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • Telugu
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.115 as of Oct 09 2023


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data] Valid XHTML + RDFa
OpenLink Virtuoso version 07.20.3238 as of Jul 16 2024, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 2 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2025 OpenLink Software